Google Play సర్వీసులు అనేది కోర్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్, ఇది ప్రతి సర్టిఫై చేయబడిన Android డివైజ్‌లో ప్రధాన ఫంక్షనాలిటీని ఎనేబుల్ చేస్తుంది, ఇది Google Play Storeకు భిన్నంగా ఉంటుంది. Google Play సర్వీసులు మూడు రకాల ప్రధాన డివైజ్ ఫీచర్‌లను అందిస్తాయి:
సెక్యూరిటీ, విశ్వసనీయత
Android డివైజ్ సెక్యూరిటీని, విశ్వసనీయతను నిర్ధారించడంలో Google Play సర్వీసులు సహాయపడతాయి, అలాగే డివైజ్‌లు లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్‌లతో అప్‌డేట్‌గా ఉండేలా చూస్తాయి. వాటిలో ఇవి ఉంటాయి:
- Google Play Protect, ఇది ��ా��్లో ��ెల���స���న మాల్‌వేర్ ఉంటే యూజర్‌లను హెచ్చరించగలదు.
- ఇతర డివైజ్‌లను సురక్షితంగా, ఆటోమేటిక్‌గా గుర్తించడానికి, కనెక్ట్ చేయడానికి డివైజ్‌ను అనుమతించడం లేదా సమీపంలోని Android డివైజ్లతో ఫైల్స్ లేదా యాప్‌లను షేర్ చేయడం లేదా యాడ్‌లతో ఇంటరాక్షన్లతో సహా యూజర్ యాక్టివిటీలో నిజమైన డివైజ్‌లు ఉన్నాయని వెరిఫై చేయడం వంటి సురక్షిత కనెక్షన్ల గుర్తింపు, ధృవీకరణ.
- SafetyNet ద్వారా మోసం, సెక్యూరిటీ ముప్పుల నుండి యాప్‌లను సురక్షితంగా ఉంచడం.
- యూజర్‌ల వద్ద లాక్ స్క్రీన్ పాస్‌కోడ్ ఉన్నప్పుడు, మీ డేటాకు సంబంధించి, పూర్తి స్థాయిలో ఎన్‌క్రిప్ట్ అయిన బ్యాకప్.
- మీ పాస్‌వర్డ్‌ల మేనేజ్మెంట్, రక్షణ.
డెవలపర్ APIలు
Google Play సర్వీసులు డెవలపర్‌లకు వేల కొద్దీ నిరంతరంగా అప్‌డేట్ అయ్యే APIలను అందజేస్తాయి, ఇవి వారి యాప్‌లలో హైక్వాలిటీ ఎక్స్‌పీరియన్స్‌లను అందించడానికి వీలు కల్పిస్తాయి, ఉదాహరణకు:
- Google Castను ఉపయోగించి మీడియాను స్ట్రీమ్ చేయడం.
- యాప్ ఫంక్షనాలిటీని మెరుగుపరచడానికి Google Mapsను ఇంటిగ్రేట్ చేయడం.
- లొకేషన్‌ను యాక్సెస్ చేయడానికి యాప్‌లకు అనుమతి ఉన్నప్పుడు, ఫ్యూజ్ చేసిన లొకేషన్ ప్రొవైడర్ ద్వారా ఖచ్చితమైన లొకేషన్ సమాచారాన్ని అందించడం.
- యూజర్, అలాగే యాప్ సెట్టింగ్‌లకు అనుగుణంగా అడ్వర్టయిజింగ్ డిజైన్లను రూపొందించడానికి డెవలపర్‌లకు వీలు కల్పించే సర్వీసులను ఎనేబుల్ చేయడం.
- మెసేజింగ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ద్వారా సకాలంలో నోటిఫికేషన్లను పంపడం.
ప్రధాన డివైజ్ సర్వీసులు
Google Play సర్వీసులు Android డివైజ్‌లలో ప్రధాన సర్వీసులను ఎనేబుల్ చేస్తాయి. ఉదాహరణకు:
- యూజర్‌లు సపోర్ట్ ఉన్న ఎమర్జెన్సీ నంబర్‌కు ఎమర్జెన్సీ కాల్ చేసినప్పుడు, నేరుగా డివైజ్ ��ొకేషన్‌ను అందుకోవడంలో Google లోకల్ ఎమర్జెన్సీ సర్వీసులకు సహాయపడుతుంది.
- యూజర్‌ల సమయాన్ని ఆదా చేయడంలో, ఇంకా టైపింగ్ ఎర్రర్‌లను తగ్గించడంలో Google ఆటోఫిల్ సర్వీసులు సహాయపడతాయి.
- సమీప షేరింగ్ అనేది యూజర్‌లకు, తమ కాంటాక్ట్‌లతో లేదా అనామకంగా ఫైల్స్‌ను పంపడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది.
- Find Hub ద్వారా పోగొట్టుకున్న డివైజ్‌ను లొకేట్ చేయడం, లాక్ చేయడం, లేదా అందులోని డేటాను పూర్తిగా తొలగించడం వంటివి సులభంగా చేయవచ్చు.
- ఫాస్ట్ పెయిర్ మీ Google ఖాతాను ఉపయోగించి బ్లూటూత్ యాక్సెసరీలను కనెక్ట్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.
Google Play సర్వీసులు ప్రయోగాత్మక ఫీచర్‌లతో సహా కొత్త ఫీచర్‌లను క్రమంగా ఎనేబుల్ చేయగలవు, అలాగే Google పాలసీల ఆధారంగా వాటిని డిజేబుల్ కూడా చేయవచ్చు. ఇది కొత్త సాఫ్ట్‌వేర్ రిలీజ్‌ను సులభతరం చేస్తుంది, అలాగే Google తన ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను మెరుగుపరచడానికి సమాచారాన్ని సేకరించడానికి కూడా అనుమతిస్తుంది, ఇందులో అడ్వర్టయిజింగ్‌కు సంబంధించిన సర్వీస్‌లు కూడా ఉండవచ్చు.
అంతే కాకుండా, ఎవరైనా యూజర్ వారి డివైజ్‌లో Google ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు, వారు తమ Google సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయవచ్చు, ఖాతా సెక్యూరిటీని మేనేజ్ చేయవచ్చు, ఇంకా Google Contacts వంటి ముఖ్యమైన డేటాను డివైజ్‌లన్నింటిలో సింక్ చేయవచ్చు.
Google Play సర్వీసులు డేటాను ఎందుకు సేకరిస్తాయి
డివైజ్ ప్రధాన ఫీచర్‌లకు సపోర్ట్ చేయడానికి Google Play సర్వీసులు సర్టిఫై చేయబడిన Android డివైజ్‌ల నుంచి డేటాను సేకరిస్తాయి.
డివైజ్, యాప్, లేదా బ్రౌజర్‌కు కంటెంట్‌ను డెలివరీ చేయడానికి IP అడ్రస్ వంటి పరిమిత ప్రాథమిక సమాచారాన్ని కలెక్ట్ చేయడం అవసరం. ఈ ఫీచర్‌లను సపోర్ట్ చేయడం కోసం, లొకేషన్, కాంటాక్ట్‌ల వంటి డివైజ్‌లోని నిర్దిష్ట డేటాను యాక్సెస్ చేయడానికి డివైజ్ తయారీదారులు Google Play సర్వీసులకు అనుమతిని ఇస్తారు.
యూజర్ కాన్ఫిగర్ చేసిన డివైజ్ సెట్టింగ్‌లు, డివైజ్‌లో ఇన్‌స్టాల్ చేసిన లేదా ఉపయోగించే యాప్‌లు, సర్వీసులు, డివైజ్ తయారీదారు, ఇంకా యూజర్ Google ఖాతా సెట్టింగ్‌లను బట్టి వాస్తవ డేటా కలెక్షన్ మారుతుంది. చాలా సందర్భాల్లో, Google Play సర్వీసులు డివైజ్ నుండి డేటాను సేకరించకుండానే డివైజ్‌లో స్థానికంగా డేటాను యాక్సెస్ చేస్తాయి.
పైన వివరించిన ప్రతి ఒక్క ఫంక్షన్‌ను సపోర్ట్ చేయడానికి, Google Play సర్వీసులు ఈ కింద పేర్కొన్న కారణాల దృష్ట్యా సమాచారాన్ని సేకరించవచ్చు:
సెక్యూరిటీని, ఇంకా మోసాన్ని నివారించడానికి
మోసం, స్పామ్, ఇంకా దుర్వినియోగం నుండి యూజర్‌లను, Google సర్వీసులను, థర్డ్ పార్టీ డెవలపర్‌ల యాప్‌లు, సర్వీసులను సంరక్షించడంలో సహాయపడటానికి Google Play సర్వీసుల ద్వారా Google డేటాను సేకరిస్తుంది. వాటిలో ఇవి ఉంటాయి:
- ఏదైనా ఒక రిక్వెస్ట్ నిజమైన యూజర్ నుండే వస్తోందని వెరిఫై చేయడానికి కావాల్సిన సమాచారం, ఇంకా మాల్‌వేర్ స్కాన్‌ల ఫలితాలతో సహా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల గురించి సమాచారం.
- యూజర్ ఒక డివైజ్‌లో సైన్ ఇన్ చేసి ఉన్నా లేదా కొత్త డివైజ్‌కు వారి డేటాను తరలించినట్లయితే వారి Google ఖాతా, లాగిన్ సమాచారం.
- ఖాతా రికవరీ సర్వీసులను అందించడానికి, అలాగే యూజర్‌లు ఫోన్ నంబర్ ఆధారిత సర్వీసులకు (Google Meet వంటివి) లాగిన్ చేయడానికి Google, డివైజ్ ఫోన్ నంబర్‌ను సేకరించవచ్చు.
- సరికొత్త సెక్యూరిటీ ప్యాచ్‌లతో డివైజ్‌లను అప్‌డేట్ చేయడానికి, ఇంకా వివిధ రకాల డివైజ్‌లు సర్వీసులో ఎంత కాలం ఉంటాయి లాంటి Android ఎకో సిస్టమ్‌లో ట్రెండ్‌లను పర్యవేక్షించడానికి IMEI, MAC అడ్రస్‌లు, సీరియల్ నంబర్‌ల వంటి హార్డ్‌వేర్ ఐడెంటిఫయర్‌లు. Google డివైజ్ కాన్ఫిగరేషన్ సర్వీసుఅనేది, డివైజ్‌లు అప్‌డేట్ అయ్యి ఉండేలా, అలాగే సాధ్యమైనంత ఉత్తమంగా పని చేసేలా చూసుకోవడం కోసం డేటాను సేకరిస్తుంది, ఇది Google Play సర్వీసుల్లో భాగంగా ఉంటుంది.
Android ఎకో సిస్టమ్‌ను సపోర్ట్ చేయడానికి, ఇంకా మెరుగుపరచడానికి
పైన వివరించినట్లుగా, Google Play సర్వీసులు అనేక APIలను, ప్రధాన డివైజ్ సర్వీసులను అందిస్తాయి. ఇవి Androidను మరిన్ని ఫీచర్‌లతో కూడిన, కనెక్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌గా మారుస్తాయి. ఈ సర్వీసులను, అలాగే APIలను అందించడం, నిర్వహించడం, మెరుగుపరచడంలో సహాయపడటానికి వాటికి సంబంధించిన డేటాను Google సేకరించవచ్చు. Google మీ డివైజ్, దానిలోని సాఫ్ట్‌వేర్, దాని వినియోగం గురించి నిర్దిష్ట సమాచారాన్ని సేకరిస్తుంది. డివైజ్ సెట్టింగ్‌లను బట్టి, డివైజ్ గురించి అదనపు సమాచారాన్ని Google సేకరించవచ్చు. ఉదాహరణలలో ఇవి ఉంటాయి:
- ఈ APIలు ఎలా ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవడానికి, అలాగే అవి సరిగ్గా పని చేస్తున్నాయని నిర్ధారించుకోవడానికి Google డేటాను సేకరిస్తుంది.
- Google లొకేషన్ ఖచ్చితత్వం ఎనేబుల్ అయి ఉంటే, డివైజ్‌లో మరింత ఖచ్చితమైన లొకేషన్‌ను అందించడంతో పాటు, లొకేషన్-ఆధారిత సర్వీసులను మెరుగుపరచడానికి లొకేషన్ సమాచారాన్ని అనామక పద్దతిలో ఉపయోగించవచ్చు. లొకేషన్ అంచనాలను క్రౌడ్‌సోర్స్ చేయడానికి, మీ డివైజ్ గుర్తించిన వైర్‌లెస్ సిగ్నల్స్, సెన్సార్‌ల లొకేషన్‌ల గురించి కాలానుగుణంగా సమాచారాన్ని సేకరించడం కూడా ఇందులో భాగంగా ఉంటుంది.
- డివైజ్‌లోని వినియోగం, విశ్లేషణల కంట్రోల్ ఎనేబుల్ చేసి ఉంటే, Google యాప్‌లు, Android డివైజ్‌ల వంటి ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను మెరుగుపరచడానికి డివైజ్ వినియోగం గురించి, అలాగే ఆ డివైజ్ ఎంత బాగా పనిచేస్తోంది అనే దాని గురించి Google అదనపు సమాచారాన్ని సేకరిస్తుంది. ఇందులో అడ్వర్టయిజింగ్‌కు సంబంధించిన సర్వీస్‌లు కూడా ఉండవచ్చు. ఈ కంట్రోల్‌ను ఆఫ్ చేయడం వల్ల, మీ డివైజ్ కొంత సమాచారాన్ని పంపే లేదా స్వీకరించే సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇందులో సిస్టమ్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ వంటి అత్యవసర సర్వీసులకు అవసరమైన సమాచారం కూడా ఉంటుంది. అలాగే, యాప్‌లు సేకరించే సమాచారంపై కూడా ఇది ప్రభావం చూపదు.
Google సర్వీసులను అందించడానికి
ఎవరైనా యూజర్ Androidలో Google యాప్‌లు, సర్వీసులను ఉపయోగిస్తుంటే, ఆ యాప్‌లు, సర్వీసులలో కనిపించే యాడ్‌లతో సహా, వాటిని అందించడానికి, మెరుగుపరచడానికి Google Play సర్వీసుల ద్వారా Google డేటాను సేకరిస్తుంది. ఉదాహరణకు:
- యూజర్ సె���్టింగ్‌ల ఆధారంగా, డివైజ్‌లలో, క్లౌడ్‌లో సింక్ చేయడానికి కాంటాక్ట్‌లు, బుక్‌మార్క్‌ల వంటి డేటాను Google సేకరిస్తుంది.
- Google Play సర్వీసులు, డివైజ్‌లన్నింటిలో యూజర్‌కు సంబంధించిన Google ఖాతా సెట్టింగ్‌లను సింక్ చేస్తాయి, అలాగే వారి ఖాతాను సంరక్షించడంలో సహాయపడటానికి సమాచారాన్ని సేకరిస్తాయి.
- Google Maps వంటి యాప్‌లలో పొందుపరిచిన ఫంక్షనాలిటీని ఎనేబుల్ చేయడానికి Google Play సర్వీసులు డేటాను సేకరించవచ్చు.
- యూజర్‌లు, బిజినెస్‌లకు నేరుగా మెసేజ్‌లను పంపడానికి, వారితో ఇంటరాక్ట్ అవ్వడానికి Google Play సర్వీసులు సహాయపడతాయి.
- Google Payను ఉపయోగిస్తున్నప్పుడు, యూజర్‌లు తమ పేమెంట్ సమాచారాన్ని మేనేజ్ చేయడంలో, స్పర్శరహిత పేమెంట్‌లు చేయడంలో లేదా డిజిటల్ కార్ కీని సురక్షితంగా ఉపయోగించడంలో Google Play సర్వీసులు సహాయపడతాయి.
- మీరు Play Games ప్రొఫైల్ లేదా సర్వీస్‌లను ఉపయోగించినప్పుడు Google డేటాను సేకరిస్తుంది.
- వెబ్ & యాప్ యాక్టివిటీలో, "ఈ డివైజ్‌లోని యాప్‌ల నుండి మీ యాక్టివిటీని సేవ్ చేస్తుంది" అనే సెట్టింగ్‌ను ఏ యూజర్‌లు అయితే తమ డివైజ్‌లో ఎనేబుల్ చేస్తారో వారి విషయంలో, Google వారి డివైజ్‌లోని యాప్‌ల నుండి యాక్టివిటీ డేటాను వారి Google ఖాతాలో సేవ్ చేసి, Google యాప్‌లను, సర్వీసులను వ్యక్తిగతీకరించడానికి దానిని ఉపయోగించవచ్చు.
Google Play సర్వీసులు సెల్యులార్ డేటాను ఉపయోగించగలవు
పైన వివరించిన ఫంక్షన్‌లను ఎనేబుల్ చేయడానికి, డివైజ్ Wi-Fiకి కనెక్ట్ కానప్పుడు, Google Play సర్వీసులు సెల్యులార్ నెట్‌వర్క్‌ల ద్వారా Googleతో సమాచారాన్ని మార్పిడి చేసుకునేలా Android డివైజ్‌లను అనుమతిస్తాయి. అంటే, Google Play సర్వీసులు మీ మొబైల్ డేటాను ఉపయోగించవచ్చని దీని అర్థం. ఇది రోజులో పలుసార్లు, మీరు మీ డివైజ్‌ను యాక్టివ్‌గా ఉపయోగించనప్పుడు సంభవించవచ్చు. Google Play సర్వీస్‌లు ఎంత సెల్యులార్ డేటాను ఉపయోగిస్తాయి అనేది డివైజ్ ఎంత తరచుగా Wi-Fiకి కనెక్ట్ అవుతుంది, డివైజ్, ఖాతా సెట్టింగ్‌లు, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. నిర్దిష్ట యూజర్ సెట్టింగ్‌లు ఈ సమాచార మార్పిడి ఫ్రీక్వెన్సీని, పరిమాణాన్ని పరిమితం చేసినప్పటికీ, వాటిని ఆఫ్ చేయడం సాధ్యం కాదు.
Google Play సర్వీసులను ఎలా డిజేబుల్ చేయాలి
సిఫార్సు చేయనప్పటికీ, ఈ దశలను ఫాలో అవ్వడం ద్వారా మీరు Google Play సర్వీస్‌లను డిజేబుల్ చేయడాన్ని ఎంచుకోవచ్చు:
- మీ Android డివైజ్‌లో సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
- కిందికి స్క్రోల్ చేసి, యాప్‌లు (లేదా యాప్‌లు & నోటిఫికేషన్‌లు
యాప్ సమాచారం) అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- అన్ని యాప్‌లను చూపే ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. ఇది అన్ని యాప్‌లు, యాప్ సమాచారం అని ఉండవచ్చు లేదా సిస్టమ్ యాప్‌లను చూడటానికి మీరు మూడు చుక్కల మెనూ చిహ్నాన్ని ట్యాప్ చేయాల్సి ఉంటుంది.
- లిస్ట్‌లో Google Play సర్వీసులను కనుగొని, దానిపై ట్యాప్ చేయడానికి కిందికి స్క్రోల్ చేయండి.
- డిజేబుల్ బటన్‌ను ట్యాప్ చేయండి.
- మీ డివైజ్‌పై పడే ప్రభావం గురించి మీకు హెచ్చరిక నోటిఫికేషన్ రావచ్చు, దయచేసి దానిని రివ్యూ చేసి, అయినా కొనసాగించాలనుకుంటే, నిర్ధారించి యాప్‌ను డిజేబుల్ చేయడానికి ట్యాప్ చేయండి.