పైథాన్ (కంప్యూటర్ భాష)
| రూపావళి | బహుళ నమూనా: వస్తు ఆధారితం, imperative, ప్రమేయ, విధానపరమైనది, పరావర్తనమైనది |
|---|---|
| విడుదల | 1991 |
| రూపకర్త | గిడో వాన్ రోసమ్ |
| అభివృద్ధికారు | పైథాన్ సాఫ్టువేర్ ఫౌండేషన్ |
| స్థిర విడుదల | 3.12.4 / 6 జూన్ 2024 2.7.18 / 20 ఏప్రిల్ 2020 |
| టైపింగు డిసిప్లిన్ | డక్, డైనమిక్, స్ట్రాంగ్ |
| ప్రధాన ఆచరణలు | CPython, పైపై, ఐరన్ పైథాన్, జైతాన్ |
| Dialects | సైథాన్, RPython, Stackless Python |
| ప్రభావితం | ABC, సీ, సీ++, Haskell, ఐకాన్, జావా, లిస్ప్, మాడ్యులా-3, పెర్ల్ |
| ప్రభావం | బూ, కోబ్రా, D, పాల్కాన్, గ్రూవీ, జావాస్క్రిప్ట్, F#, రూబీ |
| నిర్వాహక వ్యవస్థ | Cross-platform |
| లైసెన్సు | పైథాన్ సాఫ్టువేర్ ఫౌండేషన్ లైసెన్స్ |
| దస్త్ర పొడిగింత(లు) | .py, .pyw, .pyc, .pyo, .pyd |
| |

పైథాన్ అనేది ఒక కంప్యూటర్ భాష. దీనిని నెదర్లాండ్స్కు చెందిన గిడో వాన్ రోసమ్ అనే ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది. ఇది ఒక బహుళ ప్రయోజనకరమైన ఉన్నత స్థాయి కార్యలేఖన (హై లెవెల్ ప్రోగ్రామింగ్) భాష. దీనితో బాటు వచ్చే ప్రామాణిక లైబ్రరీ చాలా విస్తారమైనది, ఉపయోగకరమైనది.
ఈ భాష గతిక (డైనమిక్) రకపు వ్యవస్థను, స్వయంచాలక జ్ఞాపకశక్తి నిర్వాహణను, సమగ్రమైన ప్రామాణిక లైబ్రరీలను కలిగివుంది.
ఇతర గతిక భాషల వలె పైథాన్ భాషను తరచుగా స్క్రిప్టింగు భాష లాగానే ఉపయోగిస్తారు, అయితే స్క్రిప్టింగు కాని సందర్భాలలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. తృతీయ పార్టీ పనిముట్లను వినియోగించి, పైథాన్ సంకేతాన్ని స్వతంత్ర ఎక్జిక్యూటబుల్ కార్యక్రమాల వలె ప్యాక్ చేయవచ్చు. అంతేకాక పైతాన్ దుబాసిలు చాలా నిర్వాహక వ్యవస్థలకు అందుబాటులోవున్నాయి.
CPython అనేది పైథాన్ యొక్క రిఫెరెన్సు అమలు, ఇది ఉచితం, స్వేచ్ఛా సాఫ్టువేరు అంతేకాక కమ్యూనిటీ ఆధారిత అభివృద్ధి నమూనాను కలిగివుండి, దాదాపు అన్ని ప్రత్యామ్నాయ విధానాలను ఉంది. CPython లాభాపేక్షలేని సంస్థ అయిన పైథాన్ సాఫ్టువేర్ ఫౌండేషన్ చే నిర్వహించబడుతుంది. పైథాన్ స్థిరంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రోగ్రామింగ్ భాషలలో ఒకటిగా ర్యాంక్ పొందింది.[1]
చరిత్ర
[మార్చు]గుయిడో వాన్ రోసమ్, పైథాన్ యొక్క సృష్టికర్త
పైథాన్ 1980వ సంవత్సరం చివరలో ఉద్భవించింది, దీని అమలు నెదర్లాండ్సులో CWI వద్ద ABC భాష (SETL ప్రేరణతో)కు (అసాధారణ పరిస్థితి నిర్వహణా సామర్థ్యం, అమీబా నిర్వాహక వ్యవస్థ అంతరవర్తిగా వున్న) వారసునిగా వున్న గుయిడో వాన్ రోసమ్ చే ప్రారంభించబడింది. వాన్ రోసమ్ పైథాన్ యొక్క ప్రధాన రచయిత, ఇతడు పైథాన్ యొక్క దిశను నిర్ధేశించుటలో, నిర్ణయించుటలో కీలక పాత్రను పోషిస్తున్నాడు.
పైథాన్ అనే పేరు బ్రిటిష్ కామెడీ ప్రదర్శన “మాంటీ పైథాన్’స్ ఫ్లయింగ్ సర్కస్” నుండి ఉద్భవించింది.[2]
పైథాన్ 2.0 2000 అక్టోబరు 16 లో విడుదల అయింది, ఇందులో చెత్తను పూర్తిగా సేకరించే ఫుల్ గార్బేజ్ కలెక్టర్, యూనికోడ్ తోడ్పాటు వంటి చాలా ప్రధాన విశిష్టతలు ఉన్నాయి.
పైథాన్ 3.0 (పైథాన్ 3000 లేదా py3k అని పిలవబడుతుంది), ఒక ప్రధానమైన, ముందు రూపాంతరాలకు అనుకూలత లేని విడుదల, ఇది సుదీర్ఘ కాలం పరీక్షించబడిన తరువాత 2008 డిసెంబరు 3 న విడుదలైంది. ఇందులో ఉన్న చాలా విశిష్టతలు మునుపటి రూపాంతరాలు అయిన పైథాన్ 2.6, 2.7 కు అనుకూలంగా చేశారు.
విశిష్టతలు , తత్వం
[మార్చు]పైథాన్ అనేది ఒక బహుళ-సమాహార కార్యలేఖన భాష. ఇందులో వస్తు ఆధారిత కార్యలేఖనం, నిర్మాణాత్మక కార్యలేఖనానికి పూర్తిగా తోడ్పాటువుంది.పైథాన్‌లో క్లాసులు మరియు ఆబ్జెక్టులు కోడ్‌ను నిర్మాణాత్మకంగా రూపొందించడానికి ఉపయోగపడతాయి.[3]
పైథాన్ ప్రోగ్రామింగ్ ఉదాహరణలు
[మార్చు]print('Hello , World!')
ఔట్పుట్ : Hello , World!
మూలాలు
[మార్చు]- ↑ "The State of Developer Ecosystem in 2020 Infographic". JetBrains: Developer Tools for Professionals and Teams (in ఇంగ్లీష్). Retrieved 2025-10-27.
- ↑ Briggs, Jason R. (2013). Python for kids : a playful introduction to programming. Internet Archive. San Francisco : No Starch Press. ISBN 978-1-59327-407-8.
{{cite book}}: CS1 maint: publisher location (link) - ↑ "Python Object-Oriented Programming (OOP) Concept". www.ccbp.in. Retrieved 2025-10-27.